22న ఓటర్ల ఫైనల్‌ లిస్టు

22న ఓటర్ల ఫైనల్‌ లిస్టు

పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎన్నికల యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అధికారులు ఇప్పటికే ఓటరు జాబితా సవరణ, నమోదు ప్రక్రియ చేపట్టారు.ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల తనిఖీ కూడా నేటి నుంచి ప్రారంభం కానుం ది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ..రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాపై కసరత్తు చేస్తున్నామని, ఫిబ్రవరి 22 న తుది లిస్ టు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 1-..-1–-2019 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు పొందొచ్చన్నా రు. 11 తేదీ లోపు వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించి నట్టు చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీ నాటికి కొత్తగా ఓటరు నమోదు కోసం 1,74,966 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. సవరణలు, పేరు, చిరునామాలు, నియోజకవర్గం మార్పుల కోసం సహా మొత్తం 3,13,426 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. కొత్త ఓట్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఆదివారం నాటికి 1.47వేల దరఖాస్తుల్ని ఆమోదించినట్టు చెప్పారు. జాబితా నుంచి వివిధ కారణాలతో 28,500 ఓట్లను తొలగించి నట్టు రాజకీయ పార్టీల నేతలకు దానకిశోర్‌ వివరించారు. సమగ్రంగా ఓటరు జాబితాను తయారు చేయడానికి గతంలో డిలీట్ చేసిన వారిని కూడా పరిశీలించి తుది జాబితా రూపొందిస్తున్నా మని తెలిపారు. నాంపల్లిలో ఓటర్ల జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, సీసీఎస్ కు కూడా ఫిర్యాదు చేశామని,విచారణ పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచే శారు.