
రాష్ట్రంలో 2 కో ట్ల 96 లక్షల 97 వేల 279 మందిఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు . వారిలో 1,49,19,751మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నారని ఆయన సోమవారం వెల్లడించారు . లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు కో సం 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు 6,52,744 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. కొత్త ఓటర్లలో 3,65,548 మంది పురుషులు, 2,87,103 మంది మహిళలు, 93 మంది థర్డ్‌జెండర్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు.మొత్తం 2.96 కోట్లకు పైగా ఓటర్లలో 5,13,762మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో 71,414 మంది అంధులు, 58,310 మంది మూగ, చెవిటివారు, 2,76,186 మంది వికలాంగులు ఉండగా..ఇతర వైకల్యం కలిగిన వారు 1,07,852 మంది ఉన్నట్లు వివరించారు . హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 41,77,703 మంది ఓటర్లు ఉండగా, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 2,47,419 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అత్యధికంగా శేరిలింగపల్లిలో 6,17,169 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,45,509 మంది ఓటర్లు ఉన్నారు.లోక్‌సభ నియోజకవర్గాల వారీగా అత్యధికంగా మల్కాజ్ గిరిలో 31,39,710 మంది ఓటర్లు, అత్యల్పం గా మహబూబాబాద్ లో 14,23,351 మందిఓటర్లు ఉన్నారు.