నల్గొండ సెగ్మెంట్: రౌండ్ల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లు

నల్గొండ  సెగ్మెంట్: రౌండ్ల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లు

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఏడు రౌడ్ల కౌంటింగ్ పూర్తయింది. వీటిలో ఎమ్మెల్సీ అభ్యర్థులు సాధించిన ఓట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లను తీసేసిన తర్వాత అభ్యర్థి గెలవాలంటే కావలసిన మ్యాజిక్ ఫిగర్ 1,83,167 ఓట్లుగా తేలింది.

అభ్యర్థుల వారీగా ఒక్కోరౌండులో పోలైన ఓట్లు

టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి
మొదటి రౌండ్: 16,130

రెండో రౌండ్: 15,857

మూడో రౌండ్: 15,558

నాలుగో రౌండ్: 15,897

ఐదో రౌండ్: 15,671
ఆరో రౌండ్: 16,204
ఏడో రౌండ్: 15,523

ఏడు రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు: 1,10,840
ఆధిక్యం: 27,550

స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న
మొదటి రౌండ్: 12,046

రెండో రౌండ్: 12,070

మూడో రౌండ్: 11,742

నాలుగో రౌండ్: 12,146

ఐదో రౌండ్: 12,560
ఆరో రౌండ్: 11,910
ఏడో రౌండ్: 10,816

ఏడు రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు: 83,290

తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం

మొదటి రౌండ్: 9,080

రెండో రౌండ్: 9,448

మూడో రౌండ్: 11,039

నాలుగో రౌండ్: 10,048

ఐదో రౌండ్: 9,585

ఆరో రౌండ్: 10,505
ఏడో రౌండ్: 10,367

ఏడు రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు: 70,072

బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి

మొదటి రౌండ్: 6,615

రెండో రౌండ్: 6,669

మూడో రౌండ్: 5,320

నాలుగో రౌండ్: 5,099

ఐదు రౌండ్: 5,288
ఆరో రౌండ్: 5,237
ఏడో రౌండ్: 4,879

ఏడు రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు: 39,107

కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ 

మొదటి రౌండ్: 4,354

రెండో రౌండ్: 3,244

మూడో రౌండ్: 4,333

నాలుగో రౌండ్: 4,003

ఐదో రౌండ్: 4,340
ఆరో రౌండ్: 3,994
ఏడో రౌండ్: 3,320

ఏడు రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు: 27,588


చెల్లని ఓట్లు

మొదటి రౌండ్: 3,151

రెండో రౌండ్: 3,009

మూడో రౌండ్: 3,092

నాలుగో రౌండ్: 3,223

ఐదో రౌండ్: 3,058
ఆరో రౌండ్: 3,221
ఏడో రౌండ్: 2,882

మొత్తం ఏడు రౌండ్లలో కలిపి చెల్లని ఓట్లు: 21,636

వీరిలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించాలంటే ఇంకా 72,327 ఓట్లు, తీన్మార్ మల్లన్న 99,877 ఓట్లు, కోదండరాం 1,13,095 ఓట్లు కావాలి.