డ్రోన్ల ద్వారా సరుకుల డెలివరీ: వాల్ మార్ట్

డ్రోన్ల ద్వారా సరుకుల డెలివరీ: వాల్ మార్ట్

ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ బాయ్స్ ద్వారా కాకుండా.. నిత్యావసర సరుకులను ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. అమెరికాలోని నార్త్ కరోలినాలోని బెంటర్ విల్లేలో మొదట పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టింది.

డెలివరీ సంస్థ ఫ్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల ద్వారా కస్టమర్లకు సరుకులు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. రానున్న రోజుల్లో మిలియన్ల ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయడాన్ని చూస్తామని చెప్పింది వాల్ మార్ట్ సంస్థ. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ లా ఉంటుందని తెలిపింది.