మీరు ఏం చేయాలనుకుంటున్నారో 500 పదాల వ్యాసం రాయండి:ఎన్నికల నామినేషన్ లో కొత్త కాలమ్

మీరు ఏం చేయాలనుకుంటున్నారో 500 పదాల వ్యాసం రాయండి:ఎన్నికల నామినేషన్ లో కొత్త కాలమ్

ఎన్నికల చరిత్రలో ఫస్ట్ టైం.. ఎలక్షన్లలో కొత్త విధానం.. పోటీ చేసే అభ్యర్థులకు కొత్త రూల్.. ఎన్నికల నామినేషన్ పత్రాల్లో మీరు బయోడేటా, మీ ఆస్తులు, మీ బ్యాక్ గ్రౌండ్  రాస్తే సరిపోదు.. ప్రజలకు మీరేం చేస్తారు.. అభివృద్ది ఏవిధంగా చేస్తారు.. ఇలా అనేక ప్రజా ప్రయోజన అంశాలతో తమ ఎజెండాను సమర్పించాలి. లేకుంటే అభ్యర్థుల నామినేషన రిజెక్ట్స్ అవుతుంది. 

ముంబై మున్సిపల్ ఎన్నికల్ లో పోటీ చేసే అభ్యర్థులకు కొత్త రూల్ పెట్టింది ఎన్నికల సంఘం. నామినేషన్ పత్రంలో అభ్యర్థులు  ఏం అభివృద్ది పనులు చేయాలనుంకుంటున్నారో ఓ వ్యాసం రాసి సమర్పించాలని రూల్  తెచ్చింది.  అదీ 500 పదాలకు తగ్గకుండా రాయాలని.. వ్యాసం సమర్పించని అభ్యర్థుల నామినేషన్ రద్దు చేయాలని ఆదేశాల జారీ చేసింది. 

Also Read : BMC ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా ? 

ఈ నిబంధన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతకు ముందు ఎప్పుడూ ఉపయోగించబడలేదు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు వ్యాస కాలమ్ నింపకపోతే నామినేషన్ తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

అయితే ఎన్నికల సంఘం నిర్ణయం.. అభ్యర్థులకు గుబులకు పుట్టిస్తోంది.. కొంతమంది అభ్యర్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా..మరికొంత మంది ఈ నిబంధన అనవసరం, ఆచరణ యోగ్యం కాదంటూ తిరస్కరిస్తున్నారు. అభ్యర్థులు  తాము చేయబోయే పనులు, వాగ్దానాలను  ఇంటింటికి  కరపత్రాలు పంచి చెబుతున్నాం కదా.. కొత్త ఈ నిబంధనతో ఒరిగేందేం లేదు అని మరికొంతమంది అభ్యర్థులు అయోమయం వ్యక్తం చేస్తున్నారు.