V6 News

ఒలింపిక్స్‌‌‌‌లో టీ10 క్రికెట్​ చూడాలనుంది

ఒలింపిక్స్‌‌‌‌లో టీ10 క్రికెట్​ చూడాలనుంది
అబుదాబి: టీ10 ఫార్మాట్‌‌‌‌ను ఒలింపిక్స్‌‌‌‌లో చేర్చితే చూడాలనుందని వెస్టిండీస్‌‌‌‌ స్టార్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌ అన్నాడు. అదే జరిగితే క్రికెట్‌‌‌‌కు మరింత గుర్తింపు లభిస్తుందని యూనివర్స్‌‌‌‌ బాస్‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జమైకాలో ఉన్న ఈ డేరింగ్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ త్వరలో ప్రారంభం కానున్న అబుదాబి టీ10 లీగ్‌‌‌‌ బరిలోకి దిగనున్నాడు. ఈ సందర్భంగా టీ10 ఫార్మాట్‌‌‌‌ గురించి మాట్లాడాడు. ‘టీ10 మ్యాచ్‌‌‌‌లను ఒలింపిక్స్‌‌‌‌లో చూడాలని కోరుకుంటున్నా. అదే జరిగితే క్రికెట్‌‌‌‌కు చాలా మేలు జరుగుతుంది. అంతేకాక టీ10 లీగ్‌‌‌‌లను యూఎస్‌‌‌‌ఏ లో కూడా నిర్వహించవచ్చు. నాకు తెలిసి యూఎస్‌‌‌‌లో క్రికెట్‌‌‌‌కు ఆదరణ ఉన్న స్టేట్స్‌‌‌‌ను ఇంకా ఎవ్వరూ సరిగ్గా గుర్తించలేదు.  అక్కడిలో పరిస్థితులకు టీ10లు కచ్చితంగా సరిపోతాయి. అంతేకాక ఫైనాన్షియల్‌‌‌‌గాను సక్సెస్‌‌‌‌ లభిస్తుంది’ అని గేల్‌‌‌‌ చెప్పుకొచ్చాడు.