కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వణికిస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా… రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ మేయర్ దంపతులకు కరోనా వైరస్ సోకింది. మేయర్ గుండా ప్రకాశ్ సహా అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన బంధువులు, సన్నిహితులు,గన్ మెన్ లు, అధికారులు క్వారంటైన్‌లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, పలువురు కార్పొరేటర్లు క్వారంటైన్‌లో ఉన్నారు. గత పదిరోజులుగా మేయర్‌తో కలిసి తిరిగిన, సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు టెస్ట్‌లు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
