పీఎస్లను సందర్శించిన వరంగల్ సీపీ

 పీఎస్లను సందర్శించిన వరంగల్ సీపీ

పాలకుర్తి/ వర్ధన్నపేట/ రాయపర్తి, వెలుగు: వరంగల్​ పోలీస్​ కమిషనర్​ సన్​ప్రీత్​సింగ్​ బుధవారం కమిషనరేట్​ పరిధిలోని పలు పోలీస్​ స్టేషన్లను సందర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తి, వరంగల్​ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్​ స్టేషన్లను ఆయన పరిశీలించారు.

 పరిసరాలు, క్రైమ్​రేట్, నేరాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించి, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయనవెంట జనగామ వెస్ట్​జోన్​ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు, ఎస్సైలు తదితరులున్నారు.