గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ వెయ్యిస్తంభాల దేవాలయాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడిని వారు సందర్శించి, పరిస్థితులను పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఆఫీసర్లతో సమీక్షించారు.
వరంగల్ ఈస్ట్ పరిధిలోని 14 ఆలయాల అభివృద్ధికి రూ.14.44కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.
