
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ఆపడం ఎవరి తరం కాదు. సింగిల్ వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు బాది తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. సిక్సులతో చెలరేగుతూ అలకోవగా సెంచరీలు బాదేస్తాడు. లేటెస్ట్ గా పాక్ క్రికెట్ జహీర్ అబ్బాస్ ప్రశంసలతో ముంచెత్తాడు. రోహిత్ ఆట అంటే తనకు చాల ఇష్టమన్నాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే తాను టీవి ముందు నుంచి కదలనని అన్నాడు. రోహిత్ షాట్ల ఎంపిక బాగుంటుందన్నాడు. రోహిత్ ఆట తనకు ఆనందాన్ని ఇస్తుందన్నాడు. తన ఆటను చూస్తుంటే ఇంట్లో వాళ్లు కోహ్లీ గురించి అడుగుతారన్నాడు. అయితే కొహ్లీ ఏం తక్కువ కాదు.. కోహ్లీ కోహ్లీనే కానీ రోహిత్ ఆటను ఆస్వాదిస్తానన్నాడు.