- పనులు పూర్తయినా రోడ్లేయకుండా నిర్లక్ష్యం
- వర్షాల వేళ ప్రమాదాలు జరిగే అవకాశం
- మూడు కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో వర్షాకాలమైనా రోడ్ల తవ్వకాలు ఆగడం లేదు. వాటర్బోర్డు డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ రిపేర్ల కోసం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్కరెంట్అండర్గ్రౌండ్ కేబుల్ కోసం, ప్రైవేట్టెలికాం ఆపరేటర్లు కూడా రోడ్లను ఇష్టమొచ్చినట్టు తవ్వుకుంటూ పోతున్నారు. పనులు పూర్తయ్యాక కొందరు అలాగే వదిలేస్తుండగా, మరికొందరు గుంతలను టెంపరరీగా మట్టితో నింపి విడిచిపెడుతున్నారు. దీంతో వర్షం కురిసి అందులోకి నీళ్లు పోయి కుంగిపోతున్నాయి.
కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో టూ వీలర్ వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే, తవ్విన రోడ్లతో తీవ్రమైన ట్రాఫిక్జామ్స్ఏర్పడుతున్నాయి. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ మూడు కార్పొరేషన్లలో మెయిన్రోడ్లు, కాలనీ రోడ్లు, జంక్షన్లు అనే తేడా లేకుండా తవ్వేస్తున్నారు.
క్రిమినల్ కేసులు పెడతామన్నా..
పర్మిషన్లు లేకుండా రోడ్లను కట్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గతనెలలో జీహెచ్ఎంసీ సర్క్యులర్ జారీ చేసినా అంతా లైట్తీస్కుంటున్నారు. ఒక డిపార్ట్మెంట్పని పూర్తయ్యాక మరొక శాఖ మళ్లీ అదే రోడ్డును తవ్వడం వల్ల ప్రజా ధనం వృథా అవడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
తవ్విన రోడ్లు వేయండి ప్లీజ్..
సాధారణ సమయలో ప్రైవేట్వ్యక్తులైతే రోడ్డు కటింగ్ కోసం ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకొని అధికారులు ఆమోదించిన తర్వాత ఫీజు చెల్లించి పనులు చేసుకోవాలి. కిలోమీటర్ లోపు తవ్వకాలకు అయితే సంబంధిత జోనల్ కమిషనర్లు, అంతకు మించితే చీఫ్ ఇంజనీర్ లేదా కమిషనర్ ఆమోదం పొందాలి..రోడ్డు తవ్వి పనైపోయాక తిరిగి రోడ్డు వేసి ఇవ్వాలి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రోడ్ల కటింగ్ పై పూర్తిగా బ్యాన్ ఉంది. సంబంధిత వెబ్ సైట్ కూడా క్లోజ్ చేసేశారు.దీంతో ప్రైవేట్ వ్యక్తులు రోడ్లు తవ్వుకునేందుకు అవకాశం లేదు.
కానీ, ప్రభుత్వ శాఖలైఏ ఎలక్ట్రిసిటీ, వాటర్బోర్డు ఆగడం లేదు. ప్రభుత్వ శాఖలు కూడా ఇంతకుముందు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాల్సి ఉండేది. రోడ్డు తవ్వుకుని పనైపోయాక తిరిగి రోడ్లు వేసుకోవచ్చంటూ సర్కారు వారికి రిలాక్సేషన్ ఇవ్వడంతో వర్షాకాలంలోనూ రోడ్ల కటింగ్చేస్తున్నారు. కానీ, రోడ్లు తవ్విన కాంట్రాక్టర్ తిరిగి రోడ్డు వేయకపోవడంతో సమస్య ఏర్పడుతున్నది. దీంతో రోడ్లు వేయండి అంటూ సంబంధిత శాఖలకు జీహెచ్ఎంసీ లెటర్లు రాయాల్సి వస్తోంది.
