- నీటిని అక్రమంగా వినియోగిస్తే ఆట కట్టు
- బండ్లు కడిగితే కనిపెడతరు
- మోటర్లు పెడితే గుర్తిస్తరు
- ఫొటోలు తీస్తరు.. అప్లోడ్ చేస్తరు
- ఆఫీసర్లొచ్చి ఫైన్లేస్తరు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో తాగునీటి వృథా అరికట్టడంతో పాటు అక్రమంగా నీటిని దొంగిలిస్తున్న వారిని గుర్తించేందుకు వాటర్‌బోర్డు అధికారులు వాటర్వలంటీర్లను నియమించనున్నారు. వలంటీర్లుగా స్వచ్ఛంద సంస్థల నుంచి కొందరిని, మరికొందరిని ఐడీ ప్రూఫ్ఉన్న యువతీ యువకులను ఎంపిక చేసి నియమించాలని భావిస్తున్నారు.
ఎంపికైన వారు వారికి కేటాయించిన ప్రాంతాల్లో నల్లాలకు ఇల్లీగల్ మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారిని, మంచినీళ్లను బండ్లు కడగడానికి, గార్డెనింగ్‌కు వాడుతున్న వారిని గుర్తించి ఫొటో తీసి యాప్ లో అప్లోడ్చేస్తారు. వీరిని వాటర్సేవ్వలంటీర్అని పిలుస్తామని, త్వరలో తీసుకురాబోతున్న పానీ యాప్మొబైల్అప్లికేషన్యాక్సెస్ను వీరికి ఇస్తామని జలమండలి అధికారులు చెప్తున్నారు.
ఇలా తీస్తరు.. అలా వస్తరు
వాటర్‌బోర్డు నియమించిన వలంటీర్ఫొటో తీసి సదరు ఇంటి నెంబర్‌తో పానీ యాప్‌లోకి అప్లోడ్చేస్తారు. దీంతో అధికారులు వచ్చి కన్స్యూమర్ కనెక్షన్ నెంబర్ పై ఫైన్వేస్తారు. ఈ విషయాన్ని వినియోగదారుడికి ఫోన్‌ద్వారా సమాచారం ఇస్తారు. తర్వాత వినియోగదారుడి కనెక్షన్ అకౌంట్ కు పెనాల్టీ జమవుతుంది. అలాగే ఈ మొత్తం వచ్చే నెల బిల్లులో చెల్లించేలాగా కొత్త విధానాన్ని రూపొందించారు.
ఇలా అప్లై చేయండి
వాటర్వలంటీర్కావాలనుకునే వారు వాటర్‌బోర్డు వెబ్సైట్ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలి. తప్పనిసరిగా ఫొటో ఐడీ ప్రూఫ్ ఉండాలి. వాటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.hyderabadwater.gov.in లోని “క్విక్లింక్స్” విభాగంలో “సేవ్ వాటర్ వలంటీర్రిజిస్ట్రేషన్లింక్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. చురుకుగ్గా పని చేసే వలంటీర్లకు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తారు.
నల్లాలకు మోటార్లు పెట్టి గుంజుతున్నరు..22 మోటార్లు స్వాధీనం..సీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్ బోర్డు పైపులైన్‌కు నేరుగా మోటార్లు పెట్టి నీటిని తోడుతున్న 22 మంది మోటార్లను వాటర్‌బోర్డు అధికారులు సీజ్‌చేశారు. బుధవారం ఓఅండ్ఎం డివిజన్ 22, హైదర్ నగర్ వార్డు పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్న టైంలో తనిఖీలు నిర్వహించి 9 మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మంగళవారం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విజిలెన్స్ టీమ్సంబంధిత మేనేజర్‌తో కలిసి గాయత్రి నగర్ వార్డ్‌లో గాయత్రి నగర్ కాలనీ, జ్యోతి నగర్ కాలనీ, గాయత్రి నగర్ ఇండోర్ స్టేడియం కాలనీ ప్రాంతాల్లో డ్రైవ్ నిర్వహించి 13 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకుంది.
మొదటిసారి పట్టుబడితే మోటార్లు సీజ్‌చేస్తామని, రెండోసారి రూ.5 వేలు జరిమానా వేస్తామని చెప్పారు. ఇలాగే కొనసాగితే క్రిమినల్కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా మోటార్లు బిగించినట్టు తెలిసినా, తక్కువ ప్రెజర్ తో నీళ్లు వచ్చినా, నీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేయాలన్నారు.

