V6 News

 కేటీఆర్ ఆరోపణలు కరెక్ట్ కాదు.. హైదరాబాద్ లో నీటి కొరత లేదు: వాటర్బోర్డు

 కేటీఆర్ ఆరోపణలు కరెక్ట్ కాదు.. హైదరాబాద్ లో నీటి కొరత లేదు: వాటర్బోర్డు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఇటీవల బీఆర్ఎస్​నేత కేటీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ నగరంలో నీటి కొరత ఉందని పేర్కొనడం సరికాదని మెట్రోవాటర్​బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీనిపై మంగళవారం ఒక ప్రకటన చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి (కన్స్యూమర్ నెం: 612178979) సాధారణంగా షెడ్యూల్ ప్రకారం నీటి సరఫరా కొనసాగుతోందని అన్నారు.

ప్రస్తుతం ఆయన ఇంట్లో మీటర్ మరమ్మత్తులో ఉన్నదని, ఈ కాలనీలో యథావిధిగా రోజు విడిచి  రోజు నీటి సరఫరా జరుగుతోందన్నారు. కేసీఆర్​ నివాసంలో సమావేశాలు లేదా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి  అదనపు ట్యాంకర్ కోసం కేసీఆర్ పర్సనల్ పీఏ అభ్యర్థన మేరకు అభ్యర్ధన మేరకు ట్యాంకర్ తో బోర్డు నీరు సరఫరా చేస్తున్నదన్నారు.   ఐదు సంవత్సరాలుగా అవసరానికి తగ్గట్టుగా అభ్యర్థన మేరకు ట్యాంకర్ లను సరఫరా చేస్తోందని తెలిపారు.  ఈనెల  24- న స్టడీ సర్కిల్ వద్ద పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ చోక్ కారణంగా తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని,  అదే రోజు సమస్యను పరిష్కరించి సరఫరా పునరుద్ధరించినట్టు వాటర్ బోర్డు సీజీఎం  తెలిపారు.