V6 News

మహబూబ్నగర్ జిల్లాలో  మూడు రోజులుగా  13 గ్రామాలకు నీళ్లు బంద్

మహబూబ్నగర్ జిల్లాలో  మూడు రోజులుగా  13 గ్రామాలకు నీళ్లు బంద్

చిన్నచింతకుంట, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపూర్, అమ్మాపూర్, కురుమూర్తి, గూడురు, తిర్మలాపూర్, అప్పంపల్లి, దాసర్​పల్లి, ముచ్చింతల, చిన్నచింతకుంట గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు మూడు రోజులుగా రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో లక్ష్మీనరసింహను వివరణ కోరగా నీటి ఇబ్బంది ఉందనే విషమం తమ దృష్టికి రాలేదన్నారు.

పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లగా తమ గ్రామాలకు మూడు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడం లేదని చెప్పారు. ఇదే విషయంపై మిషన్ భగీరథ ఏఈ మహేశ్​ను వివరణ కోరగా నీళ్లు రోజు సక్రమంగానే వస్తున్నాయన్నారు. ఒక్కో అధికారి ఒక్కో సమాధానం చెప్పడం గమనార్హం.