మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌కే హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌కే హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ను బిగ్‌‌‌‌‌‌‌‌బాష్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూబీబీఎల్‌‌‌‌‌‌‌‌) ఫ్రాంచైజీ మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌ రెనెగెడ్స్‌‌‌‌‌‌‌‌ రిటేన్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. కొత్త ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌లో ఇండియా నుంచి ఒక్క హర్మన్‌‌‌‌‌‌‌‌కు మాత్రమే చాన్స్‌‌‌‌‌‌‌‌ దక్కింది. యాస్తికా భాటియా, జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌, దీప్తి శర్మతో కలిపి18 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నా ఎవరికీ అవకాశం దక్కలేదు. ప్లాటినమ్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో ఉన్న హర్మన్‌‌‌‌‌‌‌‌తో పాటు హీలీ మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ (వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌)ను రెనెగెడ్స్‌‌‌‌‌‌‌‌ తీసుకుంది. 

2021–22 సీజన్‌‌‌‌‌‌‌‌లో మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌కు ప్రాతినిధ్యం వహించిన హర్మన్‌‌‌‌‌‌‌‌ 12 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 58 యావరేజ్‌‌‌‌‌‌‌‌తో 406 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇందులో మూడు హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు ఉన్నాయి. బౌలర్‌‌‌‌‌‌‌‌గా 15 వికెట్లు పడగొట్టింది. 2016–17లో సిడ్నీ థండర్స్‌‌‌‌‌‌‌‌ తరఫున డబ్ల్యూబీబీఎల్‌‌‌‌‌‌‌‌లో అరంగేట్రం చేసిన హర్మన్‌‌‌‌‌‌‌‌ తర్వాత మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌కు మారింది. హర్లీన్‌‌‌‌‌‌‌‌ డియోల్‌‌‌‌‌‌‌‌, రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌, మన్నత్‌‌‌‌‌‌‌‌ కశ్యప్‌‌‌‌‌‌‌‌, అమన్‌‌‌‌‌‌‌‌జ్యోత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, శ్రీయాంక పాటిల్‌‌‌‌‌‌‌‌, స్నేహ్‌‌‌‌‌‌‌‌ రాణా, మేఘన సబ్బినేని, మేఘనా సింగ్‌‌‌‌‌‌‌‌, రేణుకా ఠాకూర్‌‌‌‌‌‌‌‌, పూజా వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌, రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.