ప్రపంచంలో ఎక్కువ సీసీ కెమెరాలున్న సిటీ హైదరాబాద్

ప్రపంచంలో ఎక్కువ సీసీ కెమెరాలున్న సిటీ హైదరాబాద్

టెక్నాలజీతో కేసుల పరిష్కారంలో మనమే టాప్-డీజీపీ మహేందర్​రెడ్డి
సైబరాబాద్​ కమిషనరేట్ లో​2,058 సీసీ కెమెరాల ప్రారంభం

గచ్చిబౌలి, వెలుగు: టెక్నాలజీ వినియోగిస్తూ కేసులను ఇన్వెస్టిగేషన్ చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే టాప్ లో ఉన్నారని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్లలో ఏర్పాటు చేసిన 2,058 కెమెరాలను సోమవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను మోడ్రన్​గా  తయారు చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. కేసుల ఇన్వెస్టిగేషన్ లో టెక్నాలజీని మరింత వినియోగించేందుకు గ్రేటర్ పరిధిలో మొత్తం 10 లక్షల కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమని, సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందన్నారు. ప్రతి సిటిజన్ యూనిఫాం లేని పోలీసేనని సమాజంలో జరిగే నేరాలను కంట్రోల్ చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఆరేళ్లలో పోలీసు శాఖ లో విప్లవాత్మక మార్పుల వచ్చాయని డీజీపీ చెప్పారు.

ప్రపంచంలో ఎక్కువ సీసీ కెమెరాలున్న సిటీ హైదరాబాద్

సైబరాబాద్ లోని కమిషనరేట్ పరిధిలో 2 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ చెప్పారు. నాలుగేళ్లలోనే దాదాపు లక్షా 30 వేల సీసీ కెమెరాలు కొత్తవి ఏర్పాటు చేశామన్నారు.  ప్రపంచంలో ఎక్కువగా సీసీ కెమెరాలు ఉన్న సిటీ హైదరాబాదేనని అన్నారు. సీసీ కెమెరాల కారణంగా చాలా కేసులను 24 గంటల్లో పరిష్కరించామని గుర్తు చేశారు. ఐటీ కంపెనీలు, కాలనీల ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో బెస్ట్ సీసీ టీవీ కమ్యూనిటీ  కెమెరాల కో ఆర్డినేటర్స్​కు, కమ్యూనిటీ కాంట్రిబ్యూటర్లకు మెమోంటోలు అందజేశారు. డీసీపీలు వెంకటేశ్వర్లు, పద్మజ, విజయ్​కుమార్, టీఎస్​ఐఐసీ జెడ్ సీ వినోద్​కుమార్​, శేరిలింగం పల్లి జెడ్సీ రవి కిరణ్, నిజాంపేట్ మున్సిపల్​ కమిషనర్​ గోపి,  ఎస్సీ జనరల్​ సెక్రటరీ కృష్ణ ఏదుల,  హైసియా ప్రెసిడెంట్​ భరణి, ఏసీపీలు, ఇన్​స్పెక్టర్లు పాల్గొన్నారు.