ఉత్తమ్ ​ప్రజెంటేషన్ ​మాకే అర్థం కాలే : కేటీఆర్

ఉత్తమ్ ​ప్రజెంటేషన్ ​మాకే అర్థం కాలే : కేటీఆర్

 హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​పై మంత్రి ఉత్తమ్​ ఇచ్చిన పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్ తమకే అర్థం కాలేదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్​లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్​లోనే మాట్లారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన చిట్​చాట్​చేశారు. మంత్రి మాట్లాడింది సభలో ఉన్న తమకే అర్థం కావడం లేదని ఇక ప్రజలకు ఏం అర్థమవుతుందని నిలదీశారు. కాగా, సోమవారం ఉదయం సభలో ఎదురు పడిన కాంగ్రెస్​ఎమ్మెల్యే వేముల వీరేశంను కేటీఆర్​ పలకరించారు. వీరేశం అన్న భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన విషయం మర్చిపోయారా అని కేటీఆర్​అన్నారు. వీరేశం స్పందిస్తూ.. భగీరథ నీళ్లు ఇంటింటికీ రావడం లేదని చెప్పారు.