బ్రిక్స్ పై వివక్షను ఖండిస్తున్నం ..సామాజిక ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసేందుకే ఆంక్షలు: పుతిన్

బ్రిక్స్ పై వివక్షను ఖండిస్తున్నం ..సామాజిక ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసేందుకే ఆంక్షలు: పుతిన్

తియాంజిన్: బ్రిక్స్ దేశాలపై విధించిన వివక్షపూరితమైన ఆంక్షలను రష్యా, చైనా తీవ్రంగా ఖండిస్తున్నట్లు అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.

 వరల్డ్ ఆర్కిటెక్చర్​లో బ్రిక్స్ మూల స్తంభమని పేర్కొన్నారు. చైనాలోని తియాంజిన్​లో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్​సీవో) సమిట్​కు హాజరైన పుతిన్.. ఆ దేశ అధికారిక మీడియా జిన్హువాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బ్రిక్స్ బలోపేతానికి చైనా, రష్యా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం అదనపు వనరులు సమకూర్చుకునేందుకు రష్యా, చైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో రెండు దేశాలు ఏకమై పని చేస్తున్నాయని తెలిపారు.అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్​లో సంస్కరణలు తీసుకురావాలన్నారు.