ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తా : ఎంపీ సంజయ్ రౌత్

ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తా : ఎంపీ సంజయ్ రౌత్

ముంబయి : భూ కుంభకోణం కేసులో అరెస్టై బుధవారం విడుదలైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇవాళ ఉద్దవ్ ఠాక్రేను కలవనున్నారు. ఆయనతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తోనూ భేటీ కానున్నట్లు చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో, త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నట్లు సంజయ్ రౌత్ ప్రకటించారు.

ఉద్దవ్ ఠాక్రే. శరద్ పవార్లు తనకు ఫోన్ చేసి మాట్లాడారని, తనకు ఎవరిపై ఎలాంటి కోపం లేదని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తాను నిందించడం లేదని అన్నారు. మహారాష్ట్రలో ఏర్పడిన కొత్త సర్కారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందని అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఆయనే రాష్ట్రాన్ని నడుపుతున్నట్లు అనిపిస్తోందని సంజయ్ రౌత్ సటైర్ వేశారు.