ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు

ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు
  • టెర్రరిజంపై కలిసి ఫైట్​చేద్దాం
  • ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు
  • 90వ ఇంటర్​పోల్​ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ: టెర్రరిస్టులు, క్రిమినల్స్, అవినీతిపరులు, డ్రగ్స్​ ముఠాలకు ఏ దేశం కూడా స్వర్గధామం కాకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వీరి నుంచి ప్రపంచ దేశాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. 90వ ఇంటర్​పోల్​ జనరల్​ అసెంబ్లీ సమావేశాలను మంగళవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్​లో మోడీ ప్రారంభించారు. నాలుగు రోజులు జరగబోయే ఈ మీటింగ్​కు 195 దేశాల ఇంటర్​పోల్​ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. టెర్రరిస్టులు, క్రిమినల్స్, డ్రగ్స్​ ముఠాలపై పోరాడేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మునుపటి కంటే వేగంగా ప్రమాదాలు ముంచుకొస్తున్నాయన్నారు. కొన్నిదేశాలు ఒంటరిగా పోరాడుతున్నాయని తెలిపారు. కలిసికట్టుగా ముందుకెళ్తేనే నేరాలను కట్టడి చేయొచ్చన్నారు. సేఫ్టీ, సెక్యూర్​ ప్రపంచ ఏర్పాటు అందరి బాధ్యత అని గుర్తు చేశారు.

భవిష్యత్​తరాలపై తీవ్ర ప్రభావం

ఇప్పుడు నేరాలు నియంత్రించకపోతే.. భవిష్యత్​ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మోడీ అభిప్రాయపడ్డారు. పోలీసులు, లా ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీల సహకారం పెరగాలని, దీని కోసం కొత్త విధానాలు, ప్రొటోకాల్స్​ రూపొందించాలన్నారు.

దావూద్​ను ఎప్పుడు అప్పగిస్తారు?

అండర్ ​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం, 26/11 ముంబై  బ్లాస్ట్స్​ మాస్టర్​మైండ్​ హఫీజ్​ సయీద్​ను భారత్​కు అప్పగించే అవకాశాలు ఉన్నాయా..? అని ఓ న్యూస్​ ఏజెన్సీ రిపోర్టర్, పాకిస్తాన్​ తరఫున హాజరైన ఫెడరల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ డైరెక్టర్​ మోహసిన్​ భట్​ను ప్రశ్నించాడు. వారిద్దరు ఎక్కడ ఉన్నారు..? అని క్వొశ్చన్​ చేశాడు. దీంతో భట్​కు ఏం ఆన్సర్​ ఇవ్వాలో అర్థం కాలేదు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ సైగ చేశారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.