హామీలు అమలు చేయకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తం

హామీలు అమలు చేయకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తం

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డుతోనే న్యాయం జరుగుతుందని ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అభిప్రాయపడ్డారు. సోమవారం (జులై 07) బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం బత్తుల సోమయ్య అధ్యక్షతన జరిగింది. 

ఈ సందర్భంగా చెరుకు సుధాకర్, జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి మాట్లాడారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన చేయడం సరికాదన్నారు. హామీలు అమలుచేయకుంటే అన్ని జిల్లాల్లో ఉద్యమకారులను ఏకం చేసి మరో పోరాటానికి సిద్ధం అవుతామని, సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

సమావేశంలో క్రిస్టోఫర్, భోగి పద్మ, మాధవి రెడ్డి, రషీద్, రాజేంద్రప్రసాద్, అంజలీదేవి, యాదగిరి, అంబాల రామారావు, ఉల్లంగి పద్మ, ఫక్రుద్దీన్, భిక్షం, అరుణ, పరశురాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.