
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీలో గూడ్స్ ట్రావెల్, పార్శిల్ సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఎంపీ నామానాగేశ్వరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు బస్సులో ప్రయాణం చేశారు మంత్రి. ప్రజా ప్రతినిధులంతా బస్సులో ప్రయాణం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపుతో, తాను బస్సు ప్రయాణం చేస్తున్నానని, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా బస్సెక్కాలని కోరారు. ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారని అజయ్ తెలిపారు.