మహిళా బిల్లులో ఓబీసీ కోటా కోసం పోరాడుతాం : ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లులో ఓబీసీ కోటా కోసం పోరాడుతాం :   ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: చట్ట సభల్లో మహిళలకు కల్పించే రిజర్వేషన్లలో ఓబీసీ కోటా కోసం పోరాడుతామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భారత్​లో మహిళా బిల్లుతో రాజకీయ రంగంలో మహిళలకు మంచి రోజులు వస్తాయన్నారు. లండన్​లో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్​ ఇండియా ‘మహిళా రిజర్వేషన్లు.. ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. 

మహిళా బిల్లును పార్లమెంట్​ముందుకు తీసుకురావడంలో 1996లో దేవెగౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ, 2023లో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారన్నారు. బిల్లు ఆమోదం పొందడంలో సీఎం కేసీఆర్ ​కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. అనంతరం మహిళా బిల్లు కోసం ఉద్యమించిన కవితను బ్రిడ్జ్​ఇండియా నిర్వాహకులు అభినందించారు.