బస్తీలు డ్యామేజయితే పరిహారం ఇప్పిస్తాం : మంత్రి తలసాని

బస్తీలు డ్యామేజయితే పరిహారం ఇప్పిస్తాం : మంత్రి తలసాని

డెక్కన్ మాల్ కూల్చివేత పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. అనంతరం చుట్టుపక్కల నివసించే బస్తీ వాసులతో మంత్రి మాట్లాడగా.. భవనం కూల్చివేత పనులు తొందరగా జరిపించాలని బస్తీ వాసులు కోరారు. కూల్చివేతలు జాగ్రత్తగా జరగాలనే ఉద్దేశంతోనే పనులు ఆలస్యమవుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి తలసాని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో బిల్డింగ్ ఓనర్లను పిలిపించి మాట్లాడతామన్నారు. బిల్డింగ్ కూల్చివేత కారణంగా బస్తీలు డ్యామేజ్ అయితే పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

ఫైర్ అంటుకునే మెటీరియల్ స్టోర్  చెయ్యడంతోనే ప్రమాదం జరిగిందన్న మంత్రి.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించామని చెప్పారు. ప్రమాణాలు పాటించని వ్యాపార సముదాయాలపై అధికారులు చర్యలు తీసుకుంటారని, భవనం వ్యర్ధాలను ఎక్కడ డంప్ చెయ్యాలనేది డిమాలిషన్ పూర్తయ్యాక ఆలోచిస్తామని తెలిపారు.