ఆర్టీసీ కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తాం : వివేక్ వెంకటస్వామి

ఆర్టీసీ కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తాం : వివేక్ వెంకటస్వామి

మిర్యాలగూడ: శవ రాజకీయాలు చేసేవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఉద్యమంలో 1200 మంది ఉద్యమకారుల శవాలపై నడిచి వెళ్లి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నేత వివేక్ వెంకటస్వామి. మంగళవారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు వివేక్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఎం అయిన తర్వాత కేసీఆర్ 23 మంది ఇంటర్ విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు.

గాంధీజీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండి కూడా నెహ్రూను ప్రధానిని చేసి జాతి పిత అయ్యారని..  దళితుడ్ని ముఖ్యమంత్రి చేసి తెలంగాణ పిత అయితానని తెలిపిన కేసీఆర్.. గాంధీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ..తానే ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పారు.  రాష్టానికి తుగ్లక్ పాలన అందిస్తున్న కేసీఆర్ కి త్వరలో ప్రజలే బుద్దిచెప్పాలన్నారు. 30 మంది RTC  కార్మికుల మరణానికి కారణం ప్రభుత్వమేనని తెలిపిన ఆయన .. RTC కార్మికులకు అండగా బీజేపీ ఉంటుందని చెప్పారు. సుంప్రీంకోర్టుకైనా వెళ్లి ఒక్క ఉద్యోగి ఉద్యోగం పోకుండా పోరాడుతామన్న వివేక్… ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు.

మా తండ్రి గారే మాకు ఆదర్శం

కాకా వెంకటస్వామి గుంచి మాట్లాడిన వివేక్.. ‘మానాన్న వెంకటస్వామి గారు. దైర్యంగా న్యాయం కోసం కొట్లాడే వ్యక్తి.. వారు మాకు అదే నేర్పారు. దళిత గిరిజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు… కాకా వల్ల హైదరాబాద్ లో గృహాలు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. వారు ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరికి సహాయపడేవారు. మేము సోదరులు ఇద్దరం వెంకటస్వామి కొడుకులుగానే మాకు మంచి గుర్తింపు ఉంది. విద్యాసంస్థలు స్థాపించి కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నాము. మా అంబేడ్కర్ లా కాలేజ్ అల్ ఇండియా 23rd స్థానంలో ఉంది.మా కాలేజ్ లలో అత్యంత పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ అంబెడ్కర్, కాన్షిరాం, కాకా చూపించిన దారిలో నడవాలి.

ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నన్ను అణచివేయడానికి. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మా నాన్న గారు ఇచ్చిన ధైర్యంతో తెలంగాణ సాదించాము. దళితులు అభివృద్ధి చెందాలంటే అందరూ మంచి విద్యానభ్యసించాలి. ప్రయివేటు సెక్టార్ లలో పెన్షన్ లు ప్రవేశ పెట్టిన గొప్ప వ్యక్తి కాకా. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆనాడు ఉద్యమం సమయంలో ఊపిరి పోసిన వ్యక్తి కాకా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు.. ముఖ్య కారకులు ఆ నాడు ఎంపీ లుగా పనిచేసిన వారిమే’. అని తెలిపారు వివేక్ వెంకటస్వామి.