పంజాగుట్ట, వెలుగు: మహిళా సాధికారతే లక్ష్యంగా ఎఫ్ఎల్ఓ (ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్)ను శక్తివంతమైన వేదికగా తీర్చిదిద్దుతానని కొత్త చైర్పర్సన్ సీతారెడ్డి గడ్డం ఆకాంక్షించారు. శనివారం బేగంపేటలో ఓ హోటల్లో నిర్వహించిన ఫిక్కి 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె నూతన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే కుటుంబాల్లో వెలుగులు నిండుతాయన్నారు. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అనే నినాదంతో మహిళలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
