క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తాం

క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తాం

రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు మంత్రి సబితాఇంద్రారెడ్డి. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించాలన్నారు. క్రీడాకారులకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ ప్లే గ్రౌండ్ లో ఇంద్రారెడ్డి మెమోరియల్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రి. బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టుపై జోగులాంబ గద్వాల జట్టు, బాలికల విభాగంలో సూర్యాపేట జిల్లా జట్టుపై నల్గొండ జట్టు విజయం సాధించింది. మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 

 

ఇవి కూడా చదవండి

మంత్రులను నిలదీసిన ఆర్యవైశ్య నేతలు

కేవలం జీతమే..బెనిఫిట్స్​ లేవ్!

జూన్ 2న యాడ్స్ కోసం పెట్టిన ఖర్చెంత?