మంత్రులను నిలదీసిన ఆర్యవైశ్య నేతలు

మంత్రులను నిలదీసిన ఆర్యవైశ్య నేతలు

హైదరాబాద్: వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ మంత్రులను నిలదీశారు ఆర్యవైశ్య సంఘం నేతలు. లక్డికాపుల్ వాసవీ సేవా కేంద్రంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త జన్మదిన వేడుకలకు మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎమ్యెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దయానంద హాజరయ్యారు. మంత్రులు మాట్లాడుతుండగా ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని డిమాండ్ చేశారు. 

తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ సాధన సమితి నాయకులు ప్రేమ్ గాంధీ , బుస్సు శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరిగిన ప్రభుత్వంలో ఆర్యవైశ్య సామాజికవర్గాన్ని పూర్తిగా విస్మరించారని,  సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఇంత వరకు ఏర్పాటు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ గురించి దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయాల్లో మాట ఇచ్చి ఇంత వరకు నెరవేర్చలేదని..  ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యమించకతప్పదని వారు హెచ్చరించారు. 

 

 

ఇవి కూడా చదవండి

కేవలం జీతమే..బెనిఫిట్స్​ లేవ్!

జూన్ 2న యాడ్స్ కోసం పెట్టిన ఖర్చెంత?

గజ్వేల్‌‌లో స్పౌజ్ టీచర్ల ఆవేదన సభ