
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సమస్యలన్నీ అక్టోబర్ 15 లోపు తీర్చేస్తామన్నారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ ఎన్నికల ఇంచార్జ్ విశ్వనాథన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ బుధవారం (సెప్టెంబర్ 24) ఉదయం షేక్పేట్ డివిజన్లోని ఓయూ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా షేక్ పేట్ డివిజన్లో చేపట్టిన పనుల గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ మంత్రులకు వివరించారు.
డివిజన్లో నాలాల సమస్యలు, నిర్మాణ అంశాలపై చర్చించారు. ఓయూ కాలనిలో వర్షానికి ఎఫెక్ట్ అయినా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఓయూ కాలనీలో స్ట్రాంమ్ వాటర్ డ్రైన్ కోసం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అక్టోబర్ నెలలో డివిజన్లోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.