296 మంది తాగి పట్టుబడ్డరు.. వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌‌ తనిఖీలు

296 మంది తాగి పట్టుబడ్డరు.. వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌‌ తనిఖీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌‌ తనిఖీల్లో 296 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 231 మంది బైకర్లు, 17 మంది ఆటో డ్రైవర్లు, 47 మంది కార్ డ్రైవర్లు, ఒకరు హెవీ వెహికల్ డ్రైవర్ ఉన్నారు. ఆల్కహాల్ పరీక్షల్లో 259 మందికి 100–200 పాయింట్లు, 26 మందికి 201–300, 11 మందికి 301–550 పాయింట్లు నమోదయ్యాయి. వీరందరినీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. గత వారం 215 కేసులు కోర్టుకు పంపించగా, పలువురికి జరిమానా, జైలు శిక్షతో పాటు సోషల్ సర్వీస్ విధించినట్లు వెల్లడించారు.