వారఫలాలు: ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు

వారఫలాలు: ఆగస్టు 17 నుంచి  ఆగస్టు 23వ తేదీ  వరకు

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( ఆగస్టు 17 నుంచి  ఆగస్టు 23 వ తేదీ ) రాశి ఫలాలను తెలుసుకుందాం...

మేషరాశి:  ఈ రాశి వారికి ఈ వారం ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఆరోగ్యవిషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వారం మధ్యలో గుడ్​ న్యూస్​ వింటారు.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులు ఆఫీసులో మీరే  కీలకపాత్ర పోషిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ప్రేమ..పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

వృషభ రాశి :  ఈ రాశి వారు ఈవారం కోపాన్ని అదుపుచేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఎవరితోనూ అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు.  సాధ్యమైనంత వరకు తక్కువుగా మాట్లాడండి.  వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో అనవసరంగా మాట పడాల్సి రావచ్చు.  ఆర్థికపరంగా ఖర్చులు అధికమవుతాయి.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కలసి వస్తుంది.  ఆర్థికంగా పురోభివృద్ది ఉంటుంది.  గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అనుకోకుండాలాభాలు కలుగుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగుతాయి.  ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  వారం చివరిలో గుడ్​ న్యూస్​ వింటారు.  వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు.. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.  నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. బంధువర్గంలోని వారితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఆదాయం తో పాటు.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఎలాంటి ఆందోళన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు. 

సింహరాశి: ఈ రాశి వారు  ఈ వారం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  గతంలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు ఉంటాయి.  కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు.  వారం మధ్యలో అనుకోకుండా ప్రయాణం చేసే అవకాశాలు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు. కొన్ని అదనపు ఖర్చులు  వస్తాయి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 

కన్యారాశి:  ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగాసాగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  వారం మధ్యలో ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా మంచే జరుగుతుంది.  ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

తులారాశి : ఈ రాశివారు ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  వాహనం డ్రైవింగ్​ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండంది.  వారం ప్రారంభంలో పనులు నెమ్మదిగా సాగినా.. క్రమేణ పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  లాభాలు రాకపోయినా నష్టం ఉండదు.  వారం మధ్యలో పరిస్థితులు చక్కపడతాయి.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. ఎలాంటి ఆందోళన చెందవద్దని పండితులు సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి:  ఈ రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.  ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్​ వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది.  ప్రేమ... పెళ్లి విషయాలను వాయిదా వేయండి.  ప్రతి విషయంలో కూడా సీక్రసీని మెయిన్​టైన్​ చేయండి. అంతా మంచే జరుగుతుంది. 

ధనుస్సు రాశి:  ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు పూర్తవుతాయి.  పనులు ఆలస్యం అవుతున్నాయని నిరుత్సాహం చెందవద్దు.  పని ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఏర్పడినా .. సునాయాశంగా పూర్తిచేస్తారు.  వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

మకర రాశి :  ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  మీ ఆవేశాన్ని.. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.  ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు.  శత్రువులు కూడా స్నేహితుల వలె వ్యవహరిస్తారు. ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక విషయాల్లో ఎవరికి హామీ ఉండవద్దు. ఉద్యోగస్తులు..  వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు వచ్చినా.. అంతా మన మంచికే అని ముందడుగు వేయండి .  అంతా మంచే జరుగుతుంది.  డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు ఉండే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. 

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది.  కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారం మధ్యలో గుడ్ న్యూస్​ వింటారు.  శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఉద్యోగస్తులు జాబ్​ మారేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులు వారం చివరిలో గుడ్​ న్యూస్​ వింటారు.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయని పండితులు సూచిస్తున్నారు. 

మీన రాశి:  ఈ రాశి వారికి ఈ వారం ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంశలు లభిస్తాయి.  అంతా బాగానే ఉంటుంది.  ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తుల విషయంలో గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.