వారఫలాలు: ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

వారఫలాలు:  ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (  ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్​ 6 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం...

మేషరాశి :  ఈ రాశి వారు ఈ వారంలో  అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.   నిరుద్యోగులకు జాబ్​ వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఇక ఆర్థిక విషయానికి వస్తే  ఖర్చులు అధికమవుతాయి.  ఆదాయం విషయంలో మిశ్రమ ఫలిలాలుంటాయి.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.  ఎలాంటి ఆందోళన చెందకండి.. అంతా మంచే జరుగుతుంది. 

వృషభ రాశి : వృషభరాశి: ఈ రాశి వారు  ఈ వారం చాలా వరకు అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  ఉద్యోగస్తులు అనవసరంగా మాటపడే పరిస్థితులు ఉన్నాయి.  కాబట్టి ప్రతీ విషయానికి కోపానికి గురి కాకుండా ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోండి.  ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులుసూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. వారం చివరిలో ఇబ్బంది పడే విషయాల్లో ఉపశమనం కలుగుతుంది. 

మిథున రాశి:   ఈరాశి వారికి ఈవారం చాలా అద్భుతంగా ఉంటుంది.  గ్రహాలు అనుకూలంగా ఉండటంతో  సమాజంలో గౌరవంతో పాటు గుర్తిపు లభిస్తుంది. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ప్రశంశలు.. అవార్డులు లభిస్తాయి.  వ్యాపారస్తులు అంచనాలకు మించి లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వచ్చే అవకాశం ఉంది.  బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.   వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు.. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులు పనిభారం పెరుగుతుంది.  కార్యాలయంలో  కీలకపాత్ర పోషించడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.   ఉద్యోగం మారేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆదాయం తో పాటు.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఎలాంటి ఆందోళన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు. 

సింహరాశి:  ఈ రాశి వారు ఈ వారం కొద్దిగా శ్రమ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.  వృత్తి.. వ్యాపారం.. ఉద్యోగ విషయాల్లో మొదట్లో కాస్త నెమ్మదిగా ఉన్న వారం మధ్య నుంచి పుంజుకుంటాయి.  ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు.   మిమ్మలను నమ్మించి మోసం చేసే అవకాశాలున్నాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.  ఉద్యోగస్తులు పనిభారం పెరుగుతుంది.   ఎలాంటి ఆందోళన పడకండి.. వారం చివరిలో అంతా మంచే జరుగుతుంది. 

కన్యారాశి:  ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగాసాగిపోతుంది.  ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు.  నిరుద్యోగులకు కోరుకున్న జాబ్​ లభిస్తుంది.  అనవసర ప్రయాణాలతో ఖర్చులు అధికమవుతాయి.  ఉద్యోగస్తులకు  ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

తులారాశి : ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది.  వృత్తి.. వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది లేదు.  ప్రైవేట్​ ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. . పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం.  ఆర్థిక విషయాల్లో ఎవరికి హామీ ఉండవద్దని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. ఎలాంటి ఆందోళన చెందవద్దని పండితులు సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి:  ఈ రాశికి చెందిన వారికి ఈ వారంలో ఎంతో కాలంగా పెండింగ్​ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.  వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.. ఇప్పటి వరకు మిమ్మలను వ్యతిరేకించిన వారు.. మీతో సయోధ్య కుదుర్చోక తప్పదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.  సహోద్యోగులు సహకరిస్తారు.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. 

ధనుస్సు రాశి:  ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు పూర్తవుతాయి.  ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని విజయాలు సాధిస్తారు.  ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధి కారుల నుంచి శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

మకర రాశి :  ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  రియల్​ ఎస్టేట్​ వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు.  ఉద్యోగస్తులకు ప్రశంశలు వస్తాయి.   సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆస్తి వివాదాలను పరిష్కరించు కుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  తలపెట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు.  ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. 

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది.   వృత్తి .. వ్యాపారాల్లో ధైర్యంగా ముందుకు సాగండి.  కృషికి తగిన ఫలితం ఉంటుంది.  తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. . ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్ కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  కాని ఇతరుల వలన మీరు మాట పడాల్సి ఉంటుంది.   శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.   కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయని పండితులు సూచిస్తున్నారు.  నిరుద్యోగులు.. పెళ్లికోసం ఎదురు చూసే వారు  వారం చివరిలో గుడ్​ న్యూస్​ వింటారు. 

మీన రాశి: ఈ రాశి వారికి  ఈ వారం సాదాసీదాగా సాగిపోతుంది.  ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనాన్ని పాటించండి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  పెండింగ్​ పనుల్లో పురోగతి ఉంటుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా సంతృప్తికరంగానే ఉంటుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వీలైనంతవరకు ఖర్చులు తగ్గించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.