వారఫలాలు: ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 వ తేదీ వరకు

వారఫలాలు: ఆగస్టు 3 నుంచి  ఆగస్టు 9 వ తేదీ  వరకు

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( ఆగస్టు 3 నుంచి  ఆగస్టు 9 వ తేదీ ) రాశి ఫలాలను తెలుసుకుందాం...

మేషరాశి:  ఈ రాశివారికి ఈ వారం వివాదాల నుంచి విముక్తి కలుగుతుంది.  వృత్తి.. ఉద్యోగాలు సంతృప్తికంరంగా .. అనుకూలంగా సాగిపోతాయి.  అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  చేతి వృత్తుల వారికి రాబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన రీతిలో లాభాలు ఉంటాయి. ఆదాయానికి, ఆరో గ్యానికి ఇబ్బందేమీ ఉండదు. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఉద్యోగం మారేందుకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఎలాంటి ఇబ్బంది ఉండదు.. అంతా  మంచిగానే ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. 

వృషభరాశి : ఈ వారం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి, కుటుంబం ఆర్థిక ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆస్తి విషయంలో కొన్ని సమస్యలు  వచ్చే అవకాశం ఉంది.  కెరీర్‌ పరంగా ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు.  జీవిత భాగస్వామి నిర్ణయం తీసుకోండి. . వారాంతంలో కొన్ని పరిస్థితులు సవ్యంగా జరుగుతాయి. ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉండండి.

మిథునరాశి:  ఈ రాశి వారికి ఈ వారంలో అష్టమ శని ప్రభావం తగ్గుతుంది.  దీంతో ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  కొన్ని ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి.  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వ్యవహారాల్లో సానుకూలత ఏర్పడుతుంది. కొన్ని అనవసర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. నిరుద్యోగులకు జాబ్​ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. కొత్త పరిచయాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి.  ఎవరిని గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటకరాశి :  ఈ రాశి వారికి ఈ వారం  ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి.  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  పనులు ప్రారంభించే విషయంలో మొదట్లో కొన్ని అవాంతరాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది.  వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి.  ఉద్యోగుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

సింహరాశి :  ఈ రాశి వారికి ఈ వారం  ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది.  ఉద్యోగంలో ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. . వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి.. ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు.  పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. 

కన్యారాశి : ఈ రాశి వారికి ఈ వారం  కొత్తగా కొన్ని పనులు చేపట్టే అవకాశం ఉంది.  ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  పూర్వీకుల ఆస్తికలసి వస్తుంది.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి పనివారు ఖాళీ లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు

తులారాశి : ఈ రాశి వారికి ఈ వారం అన్ని వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.ఉద్యోగులకు .. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.   మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. 

వృశ్చిక రాశి : ఈ రాశి ఈ వారం ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకుప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాలు  సానుకూలంగా సాగిపోతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.  ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సవ్యంగా సాగిపోయే అవకాశం ఉంది.   ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వవద్దని పండితులు సూచిస్తున్నారు. 

ధనస్సురాశి :ఈ రాశి వారికి ఈ వారంలో అనుకోకుండా ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.  మీరు చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తారు. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం పాటించండి.. ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు. 

మకరరాశి: ఈ రాశి వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  కొంతమంది  మాటలు విని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చకొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి.  కొత్త ప్రయత్నాలకు ఆటంకాలు కలిగాయని ఎట్టి పరిస్థితిలో విరమించుకోవద్దు.వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు.   ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే  వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి.  కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభావాలకు లొంగవద్దని పండితులు చెబుతున్నారు.

కుంభరాశి : ఈ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు పూర్తవుతాయి.  ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది.  ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా పూర్తవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. స్నేహితుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.  ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు.  ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆ రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది.  ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. 

మీనరాశి:  ఈ రాశి వారికి ఈ వారం పనిభారం పెరుగుతుంది.  అనవసరంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.  కృషి .. పట్టదలతో అనుకోకుండా లక్ష్యాన్ని సాధిస్తారు. ఎదుటివారి అభిప్రాయాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.  ఉద్యోగస్తులు వారి పనిపై దృష్టి పెట్టండి.   ఒకటి రెండు దీర్ఘకాలిక వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.   ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.