వారఫలాలు: జులై27 నుంచి ఆగస్టు 2 వ తేదీ వరకు

వారఫలాలు: జులై27 నుంచి  ఆగస్టు 2 వ తేదీ  వరకు

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జులై 27 నుంచి ఆగస్టు 2 వ తేది  వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం.

మేష రాశి:  ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సామాన్యలాభాలుంటాయి, ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి,  ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  వృత్తి వ్యాపారాలు అభివృద్దిచెందుతాయి.  వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.  ఇతరులతో మాట్లాడేడప్పుడు జాగ్రత్తగా ఉండండి.  ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది. 

మిథునరాశి:  ఈ వారం ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  వివాదాలకు దూరంగా ఉండండి.  ఇతరులతో సంభాషించే విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది.  శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

కర్కాటకరాశి:  ఈ రాశి వారికి  ముఖ్యమైన పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి.  ఆర్థిక సమ స్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.  ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

సింహరాశి:  ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక సమస్యల నుంచి  విముక్తి కలిగే అవకాశం ఉంది.  పూర్వీకుల ఆస్తి కలసి వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. . కొద్దిగా నిదానంగానే అయినా ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఎటువంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది, ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

కన్యారాశి:  ఈ రాశి వారికి  ఈ వారం ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది..  కావున చాలా అప్రమత్తంగా ఉండాలి.  ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

తులారాశి:  ఈ వారమంతా హ్యాపీగా, సానుకూలంగా గడిచిపోతుంది.  వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగు తుంది. మీ సలహాలు, బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేసే  అవకాశం ఉంది.  ఏపని తలపెట్టినా ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. 

వృశ్చికరాశి:  ఈ రాశి వారికి చిన్నా చితకా సమస్యలున్నా  వారమంతా సానుకూలంగానే సాగిపోతుంది.  ఆర్థిక వ్యవహారాల్లో  ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.  వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. జాబ్​ మారేందుకు మంచి సమయమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  నిరుద్యోగులు మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. వృ స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహా రాల్లో దూసుకుపోతారు. గతంలో ప్రయత్నించిన పెళ్లి సంబంధం ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది.

ధనుస్సురాశి:ఈ రాశి వారికి ఈ వారం  అన్ని విధాలుగా మిశ్రమ ఫలితాలుంటాయి.   ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంది.  అయితే ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది.  ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.  అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆస్తుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.. 

మకరరాశి:  ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.  ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి.  సమాజంలో  ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. కొత్త  వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.  ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే సహోద్యోగులతో చిన్నా చితకా సమస్యలుంటాయి. పనిభారం బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. హామీలు ఉండవద్దని పండితులు సూచిస్తున్నారు. 

కుంభరాశి:  ఈ రాశి వారికి ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  గతంలో ఉన్న ఆర్థిక సమస్యలకు కొంత వరకు ఉపమనం కలిగే అవకాశం ఉంది.   ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. పని ఒత్తిడి, పనిభారం ఎక్కువగా ఉంటాయి. స్నేహితులు.. బంధువుల వలన కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి వాటి వల్ల ఇబ్బంది పడతారు.

మీనరాశి:  ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు కొద్దిగా సంతృప్తికరంగా సాగిపో తాయి. కుటుంబంలో చిన్నపాటి టెన్షన్లు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.  వారం మధ్యలో డ్రైవింగ్ చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనానికి సంబంధించిన ఇబ్బందులు అధికంగా ఉంటాయి. గృహ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది.వ్యాపార భాగస్వాములతో, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  కొత్త ప్రాజెక్ట్​లు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి.  ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.