బరువు తగ్గించే మెడిసిన్ తో గుండెకు మేలు

బరువు తగ్గించే మెడిసిన్ తో గుండెకు మేలు
  • హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్‌‌‌‌ ప్రమాదాలను తగ్గిస్తున్న సెమాగ్లుటైడ్
  • డెన్మార్క్ సంస్థ స్టడీలో వెల్లడి

కోపెన్ హెగెన్: బరువు తగ్గించే మెడిసిన్ సెమాగ్లుటైడ్ వల్ల హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్‌‌‌‌ వంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని డెన్మార్క్ కు చెందిన నోవో నార్డిస్క్ హెల్త్ కేర్ సంస్థ రీసెర్చ్ లో తేలింది. రీసెర్చ్ కోసం 45 ఏండ్లు పైబడిన , అధిక బరువు, గుండె జబ్బులున్న17,604 మంది నుంచి హెల్త్ డేటా సేకరించారు. వీరికి వారానికి ఒకసారి చొప్పున 4 నెలలపాటు సెమాగ్లుటైడ్ ను తగిన మోతాదులో ఇచ్చారు. 

దీనివల్ల వారిలో  గుండెపోటు, హార్ట్ స్ట్రోక్స్ వంటి ముప్పులు 20% తగ్గాయి. కోల్పోయిన బరువుతో  సంబంధం లేకుండా ఈ ఫలితం వచ్చింది. నడుము సైజు తగ్గడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ స్టడీ తేల్చింది. సెమాగ్లుటైడ్ మెడిసిన్ రెండేండ్ల పాటు వాడితే గుండె రక్షణ మూడింట ఒక వంతు పెరుగుతుందని కూడా వీరు గుర్తించారు.