బరువు తగ్గాలనుకునే వారు డైటింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు..అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రోజంతా వీరసంగా ఉంటుంది. బీపీ తగ్గిపోతుంది. జీర్ణ సంబంధిత సమస్యలొస్తాయి. మరి ఇన్ని ఇబ్బందులు రాకుండా ఉండాలంటే స్వల్ప పరిమాణంలో సమతుల ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గేందుకు ఉపయోగపడే కొన్ని రకాల జ్యూసులు కూడా తాగుతుండాలి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు జ్యూసుల్లో అదనంగా చక్కర చేర్చుకోకూడదు. మీరూ బరువు తగ్గే పనిలో ఉంటే ఈ డ్రింకులు ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునే వారు ముందుగా చేసే పని డైటింగ్.. తినడాన్ని, తాగడాన్ని చాలా తగ్గిస్తారు. ఇది సరైన పద్ధతికాదని చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.. ఆహారాన్ని సరైన పద్ధతిలో తీసుకోవడంతోపాటు, మంచి హెల్త్ డ్రింకులు తాగడం వల్ల బరువు తగ్గించవచ్చని వారు చెబుతున్నారు. ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకునే కొన్ని జ్యూసులతో బరువు తగ్గే పని సులభమవుతుంది.
పైనాపిల్-లెమన్ జ్యూస్ : గ్రాసు పైనాపిల్ జ్యూస్ లో అరకప్పు నిమ్మరసాన్ని కలపాలి.దీంట్లో దాల్సిన చెక్క పొడి బ్లాక్ సాల్ట్ కొద్దిగా కలుపు కోవాలి. పైనాపిల్ లో ఉన్న మెలైన్ అనే పదార్థం బరువు తగ్గడంలో సహ కరిస్తుంది. ఈ జ్యూస్ జీర్ణక్రియను మె రుగుపరిచి. రక్తనాళాల్లోని అవరోదాల్ని తొలగిస్తుంది.
గ్రీన్ టీ-పుదీన:గ్రీన్ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనా టున్నాయనే సంగతి తెలిసిందే. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రీన్ టీ తాగితే మంచిది. గ్రీన్ టీలో నాలుగైదు పుదీనా ఆకులు వేసుకుని తాగడం వల్ల బరువు తగ్గవ చ్చు. ఇతర జీర్ణసంబంధ సమస్యల్ని కూడా తొలగిస్తుంది.
లెమన్–హనీ:ఇది చాలా మంది ప్రతి రోజూ తాగుతు న్న జ్యూసే.. గోరు వెచ్చటి నీరు... నిమ్మరసం..తేనె.. మూడూ కలిపి ఉదయాన్నే పర గడుపున తాగాలి. ఇది బరువును తగ్గి స్తుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా, పేగులు శుభ్రపడేలా కూడా చేస్తుంది. నిమ్మకాయలో ఉన్న యాసిడ్స్ తేనెతో కలపడం వల్ల ఇది మరింత ప్రభావవం తంగా పనిచేస్తుంది.
జీలకర్ర వాటర్ డ్రింక్: ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండేజీలకర్రతో కూడా బరువు తగ్గే డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఇది చాలా సులభం. గుప్పెడు జీలకర్ర తీసుకుని, రాత్రంతా గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని గిన్నెలో పోసుకుని వేడి చేయాలి. ఈ నీళ్లు కాస్త గోరువెచ్చగా ఉండగానే, ఖాళీ కడుపుతో తాగాలి. ఈ డ్రింక్ ఒంట్లోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగాబరువు తగ్గుతారు.
లెమన్–జింజర్ వాటర్: రెండు నిమ్మకాయలతో తీసిన రసాన్ని గోరు వెచ్చటి నీటిలో కలపాలి. దీనిలోకి పావు కప్పు అల్లం రసం కలుపుకుని తాగాలి. ఇందులో ఉన్న జింజరోల్స్, బీటా కెరోటిన్, కేఫిక్ యాసిడ్లు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
టొమాటో అండ్ లైమ్ జ్యూస్: ఒక కప్పు టొమాటో జ్యూస్, పావు కప్పు నిమ్మ రసం కలపాలి. దీనికి చిటికెడ్ బ్లాక్ సాల్ట్ కలిపి తాగాలి. టొమాటోలో అనేక విటమిన్స్, మినరల్స్ , ఫైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి. నిమ్మలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గించే పోషకాలే..
దాల్చిన చెక్క-బొప్పాయి జ్యూస్: ఒక కప్పు బొప్పాయి పండ్ల ముక్కలు, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, కప్పు చల్లటి నీళ్లు, చిటికెడు బ్లాక్ సాల్ట్ తీసుకుని అన్నింటినీ కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. బొప్పాయి పండులో ఉన్న పోషకాలు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. చెడు కొవ్వును తొలగిస్తాయి.
ద్రాక్ష-గోధుమ గడ్డి జ్యూస్: ఒక కప్పు గోధుమ గడ్డిలో ఆర కప్పు ద్రాక్ష పండు, అరకప్పు. నీళ్లు కలిపి జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ లో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలుపుకొంటే రుచిగా ఉంటుంది. గోధుమ గడ్డి చెడు కొవ్వును తగ్గిస్తుంది. ఒంట్లోని వ్యర్థాల్ని తొలగిస్తుంది. ద్రాక్షలోని యాంటీ ఆక్సిటు రక్తంలో చక్కెర నియంత్రించి బరువును తగ్గిస్తాయి.
కోకోనట్ – పైనాపిల్ డ్రింక్: ఒక కప్పు తాజు కొబ్బరి నీళ్లలో పావు కప్పు పైనాపిల్ జ్యూస్ కలపాలి. దీనికి చిటికెడు బ్లాక్ సాల్ట్ పోంపు పొడి కలు పుకొని తాగితే రుచిగా ఉంటుంది. ఈ డ్రింక్ బరువు తగ్గిస్తుంది ఒంట్లోనీ మలినాలు తొలగిపోయేందుకు, కిడ్నీ పనితీరు మెరుగు పరిచేందుకు సహకరిస్తుంది.
