సంక్షేమ పాలనే వైఎస్ ను ప్రజల గుండెల్లో నిలిచేలా చేసింది

సంక్షేమ పాలనే వైఎస్ ను ప్రజల గుండెల్లో నిలిచేలా చేసింది

పేదరికాన్ని రూపుమాపడమే YSR తెలంగాణ పార్టీ లక్ష్యమన్నారు వైఎస్ షర్మిల. హైదరాబాద్ లో YSRTP ని ఆవిష్కరించారు. తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వైఎస్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. YSR పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో బాగంగా వైఎస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. గుండె నిబ్భరంతోనే ఏ పనినైనా సాధించే గొప్పనేత వైఎస్ అని అన్నారు. ప్రజలపై ఎంత ప్రేమ ఉందో ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే సాక్ష్యమన్నారు. శత్రువులు కూడా ప్రశంసించిన నేత వైఎస్ఆర్ అని తెలిపారు. నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్లే నని చెప్పారు. వైఎస్ సంక్షేమ పాలనా తీసుకొచ్చేందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్నారు.YSRTP ముఖ్యంగా మూడు లక్ష్యాలు..సంక్షేమం, స్వయం సంవృద్ధి, సమానత్వం అని అన్నారు. 

పేదబిడ్డలకు ఉన్నత చదువులు, కార్పొరేట్ ఆరోగ్యం, 108 ఇలా పేదవారి సంక్షేమానికి వైఎస్ఆర్ పెద్దపీట వేశారన్నారు వైఎస్ షర్మిల. మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు, 11 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. పక్క ఇల్లు, భూమి లేని పేదవానికి భూములు, మహిళలకు రుణాలు ఇచ్చి పేదరికాన్ని రూపుమాపారన్నారు. సంక్షేమ పాలనే వైఎస్ ను ప్రజల గుండెల్లో నిలిచేలా చేసిందన్నారు. వైఎస్ సంక్షేమ పథకాలను అమలు చేసి పేదరికాన్ని రూపు మాపడమే తమ సిద్ధాంతమన్నారు వైఎస్ షర్మిల.