పాక్‌‌తో కలసి వచ్చినా యుద్ధానికి రెడీ

పాక్‌‌తో కలసి వచ్చినా యుద్ధానికి రెడీ

న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌‌తో కలసి చైనా యుద్ధానికి కాలు దువ్వితే దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌‌కేఎస్ భదౌరియా చెప్పారు. బార్డర్‌‌‌లో చైనా, పాకిస్తాన్‌‌లతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో భదౌరియా స్పందించారు. ‘లడఖ్‌లో చైనా ఏం చేస్తుందనే దాన్ని మేం మే నెలలో గుర్తించాం. డ్రాగన్ ఎత్తుగడను పసిగట్టిన వెంటనే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చాలా త్వరగా స్పందించాయి. పాకిస్తాన్‌‌, చైనా కలసి పని చేస్తున్నాయి. పలు విషయాల్లో చైనా మీద పాకిస్తాన్ ఆధారపడింది. యుద్ధం అనేది వస్తే మెరుగైన ఇండియా (ప్రత్యర్థి)ను చైనా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కీలకమైన ప్రాంతాల్లో మన సైనికులను మోహరించాం. లడఖ్ చాలా చిన్న ప్రాంతం. ఏ యుద్ధానికైనా మేం సంసిద్ధంగానే ఉన్నాం’ అని భదౌరియా పేర్కొన్నారు.