ప్రాంతీయ పార్టీలను బీజేపీ భయపెడుతోంది : దీదీ

ప్రాంతీయ పార్టీలను బీజేపీ భయపెడుతోంది : దీదీ

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఏజెన్సీ సంస్థలు (సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ) డబ్బు, మాఫియా శక్తిని ఉపయోగించి.. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తోంది అంటూ మండిపడ్డారు.

భవిష్యత్తులో ఏదో ఒక రోజు బీజేపీని కూడా ఇలాగే విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ఇలాంటి రాజకీయాలకు తాను మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రస్తుతం‘మహా వికాస్ అఘాఢీ’ సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం సమసిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారామె.