బెంగాల్ ను ముంచెత్తిన వానలు

బెంగాల్ ను ముంచెత్తిన వానలు

పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అస్థవ్యస్థమైంది.వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జల్ పైగురి జిల్లాలోని గరల్ బరిలో  వాన దంచికొట్టింది. పల్లె, పట్టణ ప్రాంతాల్లోని  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షానికి రోడ్లు చెరువులను  తలపించడంతో స్టూడెంట్స్ ను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఇక చేసేది ఏమీ లేక వారిని ఇంట్లోనే ఉంచుతున్నారు. రాబోయే రెండు రోజులు పశ్చిమబెంగాల్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.