వెస్ట్ మారేడ్ పల్లిలో ఇందిరమ్మ క్యాంటీన్.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం

వెస్ట్ మారేడ్ పల్లిలో ఇందిరమ్మ క్యాంటీన్.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
  •       ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం శక్తితో ముందుకు సాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. వెస్ట్ మారేడ్​పల్లిలో సాయి సాత్విక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహిళా శక్తి’ క్యాంటీన్​ను మంగళవారం ఆయన ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.  నేతలు డాకూనాయక్, మెప్మా కోఆర్డినేటర్ యాదయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్ రావు పాల్గొన్నారు.