గ్రెనెడా: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్-వెస్టిండీస్ ల మధ్యన బుధవారం జరిగిన మూడో వన్డే సంచలనం సృష్టించింది. స్టేడియంలో సిక్సర్లు, బౌండరీల మోత మోగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అత్యధికంగా(418) స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్లు జాస్ బట్లర్ (77 బాల్స్ లో 150; 13 ఫోర్లు, 12 సిక్స్‌లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (88 బాల్స్ లో 103; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్ ఆడారు.
వెస్టిండీస్ కూడా..
వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ చెలరేగడంతో మరో రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్.. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటేశాడు. ఈ మ్యాచ్ లో గేల్ 162 రన్స్ చేశాడు. గేల్ కు ఇది 25వ వన్డే సెంచరీ. 39 ఏళ్ల గేల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 500(3 ఫార్మాట్లు) సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన 14వ బ్యాట్స్‌మెన్‌గా చరిత్రకెక్కాడు. గతంలో వన్డేల్లో పది వేల పరుగుల చేసిన ప్లేయర్లలో బ్రియాన్ లారా ఉన్నాడు. అయితే వన్డేల నుంచి ప్రపంచ కప్ తర్వాత రిటైర్‌కానున్నట్లు గేల్ చెప్పాడు. దీంతో రికార్డులన్నీ దుడిచేపనిలో ఉన్నాడంటూ వెస్టీండీస్ టీమ్ గేల్ పై ప్రశంసలు గుప్పిస్తుంది. ఈ మ్యాచ్ లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ ధాటిగా ఆడి 48 ఓవర్లలో 389 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
WHAT A MATCH!
West Indies make their highest ever ODI total of 389 but Jos Buttler's 150, a century from captain Morgan, Adil Rashid's five-for and four wickets from Mark Wood help England to victory by 29 runs!#WIvENG scorecard ➡️ https://t.co/Nq5TqAKpGj pic.twitter.com/jUqlLOMLO0
— ICC (@ICC) February 27, 2019

