ఏపీ స్కూళ్లలో ఫీజులు ఎట్లున్నయ్‌?

ఏపీ స్కూళ్లలో ఫీజులు ఎట్లున్నయ్‌?

పరిశీలనకు వెళ్లనున్న రాష్ట్ర టీం 
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తున్న ఫీజుల విధానంపై ప్రభుత్వం స్టడీ చేస్తోంది. రాష్ట్రంలో అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ నెల 24న ఏపీ సర్కారు ఫీజులను నియంత్రిస్తూ జీవో 53, 54 తీసుకొచ్చింది. ఏపీ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ ద్వారా ఫీజుల విధానాన్ని అమలు చేస్తోంది. రూరల్ ఏరియాల్లో ప్రైమరీలో రూ.10 వేలు, హై స్కూల్​లో రూ.12 వేలు, కార్పొరేషన్ పరిధిలో హైస్కూల్​లో రూ.18 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. జూనియర్ కాలేజీల్లో అత్యధికంగా కార్పొరేషన్​ పరిధిలో ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లకు రూ.20 వేల ఫీజు ఉంది. గ్రామ, మున్సిపాలిటీల పరిధిలో తక్కువగా ఉంది. హాస్టళ్లలో కార్పొరేషన్​ స్థాయిలో రూ.24 వేల ఫీజు నిర్ణయించారు. ఈ ఫీజులు మూడేండ్ల పాటు అమలు చేయాలని నిర్ణయించినట్లు కమిషన్ పేర్కొంది. ఈ విధానంపై నివేదిక ఇవ్వాలని విద్యా శాఖ సెక్రటరీని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. ఫీజులను ఎలా నిర్ణయించారు? అమలుకు అడ్డంకులు లాంటి వివరాలు సేకరించాలని ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదిక ఇచ్చినా సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.