పిల్లలకు పాలు పడట్లేదా.?

పిల్లలకు పాలు పడట్లేదా.?

ఐస్‌‌‌‌‌‌‌‌క్రీమ్‌‌‌‌‌‌‌‌ తిన్నా.. మిల్క్‌‌‌‌‌‌‌‌ షేక్‌‌‌‌‌‌‌‌ తాగినా కొంతమంది పిల్లలకు పడదు. పాలు తాగినా, పెరుగన్నం తిన్నా కడుపునొప్పి అంటారు. ‘పాలు తాగకుండా తప్పించుకోవడానికి’ ఇలాంటి సాకులు చెబుతున్నారేమో అనుకుంటారు. కానీ, అది లాక్టోజ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌టాలరెన్స్‌‌‌‌‌‌‌‌. అంటే పాలు, పాల ఉత్పత్తులు పడకపోవడం. 

‘లాక్టేజ్‌‌‌‌‌‌‌‌’ అనే ఎంజైమ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ అవ్వక పోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. పాలు తాగకపోతే.. పోషకాలు అందవు. తాగితే ఇబ్బంది. మరి ఈ లాక్టోజ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌టాలరెన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్న పిల్లలకు పోషకాలు ఎలా? పాలకు బదులుగా ఏం ఇవ్వాలి? లాక్టేజ్‌‌‌‌‌‌‌‌ అనేది డైజషన్‌‌‌‌‌‌‌‌ కోసం ఉపయోగపడే ఒక ఎంజైమ్‌‌‌‌‌‌‌‌. పాలు, పాల ఉత్పత్తుల్లో గ్లూకోజ్‌‌‌‌‌‌‌‌, గెలాక్టోజ్‌‌‌‌‌‌‌‌లు కలిసి ఏర్పడే లాక్టోజ్‌‌‌‌‌‌‌‌ అనే చక్కెర  అరగడానికి ఇది ఉపయోగపడుతుంది. కొంతమంది పిల్లల్లో ఆ ఎంజైమ్‌‌‌‌‌‌‌‌ నేచురల్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్‌‌‌‌‌‌‌‌ కాదు. అందుకే, ఐస్‌‌‌‌‌‌‌‌క్రీమ్‌‌‌‌‌‌‌‌, చీజ్‌‌‌‌‌‌‌‌, పాలు, ఇంకొన్ని పాల పదార్థాలు తింటే పిల్లలకు అరగదు. దాంతో కడుపునొప్పి రావడం, గ్యాస్ట్రిక్‌‌‌‌‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌, నీళ్ల విరేచనాలు, వికారం, చర్మంపై దద్దుర్లు రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పిల్లలకు పాలు తాగించడం, పాల ఉత్పత్తులు పెట్టకపోవడం మంచిది. పాల నుంచి వచ్చే పోషకాలు అందాలంటే డైరీ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ కాకుండా దానికి బదులుగా ప్లాంట్‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ ఇస్తే మంచిది. 

పాలకు బదులు..

ఎదిగే పిల్లలకు పాలు ఇవ్వాలని, అప్పుడే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారని తరచూ వింటుంటాం. నిజానికి వాళ్లకు కావాల్సింది పాలు కాదు. పాల నుంచి వచ్చే పోషకాలు. విటమిన్‌‌‌‌‌‌‌‌ – డి, ప్రొటీన్‌‌‌‌‌‌‌‌, క్యాల్షియం, ఫ్యాట్‌‌‌‌‌‌‌‌ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అందుకే, లాక్టోజ్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న  పిల్లలకు ఆ పోషకాలు  అందే  ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి. సోయా , ఆల్మంద్‌‌‌‌‌‌‌‌, ఓట్‌‌‌‌‌‌‌‌, రైస్‌‌‌‌‌‌‌‌, కొబ్బరి పాలు లాంటి ప్లాంట్‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ ఇవ్వొచ్చు.  

సోయా మిల్క్‌‌‌‌‌‌‌‌ బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 

మిగతా పాలతో పోలిస్తే సోయా మిల్క్‌‌‌‌‌‌‌‌ బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటున్నారు డాక్టర్లు. సోయా మిల్క్‌‌‌‌‌‌‌‌లో లాక్టోజ్‌‌‌‌‌‌‌‌ తక్కువగా ఉంటుంది. దాంట్లో దాదాపు ఆరు గ్రాముల ప్రొటీన్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. మూడు గ్రాముల కార్బొహైడ్రేట్లు, నాలుగు గ్రాముల ఫ్యాట్‌‌‌‌‌‌‌‌, 80 కాలరీలు ఉంటాయి. సోయా మిల్క్‌‌‌‌‌‌‌‌తో పాటు బ్యాలెన్స్డ్‌‌‌‌‌‌‌‌ డైట్‌‌‌‌‌‌‌‌ ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.