Asia Cup 2025: దేశవ్యాప్తంగా బాయ్ కాట్ నినాదాలు.. పాకిస్థాన్‪తో ఇండియా మ్యాచ్ ఆడకపోతే ఏంటి పరిస్థితి..?

Asia Cup 2025: దేశవ్యాప్తంగా బాయ్ కాట్ నినాదాలు.. పాకిస్థాన్‪తో ఇండియా మ్యాచ్ ఆడకపోతే ఏంటి పరిస్థితి..?

ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) దాయాధి దేశంతో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో..పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దే వద్దు అంటూ దేశంలో తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని గంటల్లో జరగనున్న ఈ మ్యాచ్ పై పెద్దగా బజ్ లేదు. దేశవ్యాప్తంగా బాయ్ కాట్ డిమాండ్ లు.. టికెట్ల రేట్ భారీగా పెంచడం.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడంతో మ్యాచ్ కు కొద్దిగా క్రేజ్ తగ్గిన మాట వాస్తవమే. ఒకవేళ నేడు ఇండియా చివరి నిమిషంలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకుండా నిరాకరిస్తే ఏంటి పరిస్థితి అనే విషయం ఇప్పుడు చూద్దాం.. 

రూల్స్ ప్రకారం.. ఇండియా లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడానికి నిరాకరిస్తే సల్మాన్ అఘా కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టుకు వాకోవర్ లభిస్తుంది. దీంతో పాకిస్తాన్  జట్టు ఖాతాలో విజయం చేరుతుంది. పాక్ తో ఆడడానికి అంగీకరించకపోతే ఇండియా ఈ మ్యాచ్ లో ఓడిపోయినట్టే. అప్పుడు సూపర్-4 లో ఒమన్ పై చివరి మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి. సూపర్-4 మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుతో ఆడాల్సి వచ్చి.. ఇండియా మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్ జట్టుకు విజయాన్ని ఇస్తారు. అప్పుడు ఫైనల్ ఆశలు సంక్లిష్టం అవుతాయి. ఒకవేళ ఫైనల్లో గనుక పాక్ తో ఇండియా ఆడకుంటే పాకిస్థాన్ జట్టును విజేతగా ప్రకటిస్తారు. 

గతంలో ఉన్నంత హైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సగం కూడా లేని ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  అభిమానులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. టోర్నీ ఆతిథ్య హోదాలో ఇండియా బరిలోకి దిగనుంది. అయితే ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూర్యసేననే ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తోంది. అయితే టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫలితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఇరుజట్లు నాణ్యమైన క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటంపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలా తక్కువ మంది హాజరుకావడంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా కూడా జట్ల ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలాబలాలను పక్కనబెట్టి.. ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివాదాలనే ఎక్కువగా హైలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటం, గెలవడం ఇరుజట్లకు కత్తిమీద సాముగా మారింది. 

తుది జట్లు (అంచనా)

ఇండియా:

సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ, సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శివమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూబే, హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా, అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, బుమ్రా

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:

సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగా (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), షాహిబ్జాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహ్మద్​ హారిస్, హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫహీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అష్రఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షాహిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా ఆఫ్రిది, సుఫియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అబ్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌