లండన్: నైట్ క్లబ్ వివాదంలో చిక్కుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, అట్కిన్సన్‌కు ఊరట లభించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన క్రికెట్ స్వతంత్ర పర్యవేక్షణ ప్యానెల్ సోమవారం ఈ ఇద్దరికి క్లీన్‌చిట్ ఇచ్చింది. ప్లేయర్లపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.
తొలి టెస్ట్ తర్వాత ఇంగ్లండ్ బోర్డు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూ రూల్‌ను స్టోక్స్, అట్కిన్సన్ ఉల్లంఘించారు. ఈ ఇద్దరు లండన్ నైట్‌క్లబ్‌లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ రగ్బీ క్లబ్ 'సారాసెన్స్'కు చెందిన ఒక ఆటగాడు.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భద్రతా అధికారిపై దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇందులో స్టోక్స్, అట్కిన్సన్ కూడా జోక్యం చేసుకోవడం వివాదం పెద్దదైంది. ‘అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను, సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవు’ అని ప్యానెల్ పేర్కొంది.
