విజయ్, అనసూయ మధ్య వివాదం ఏంటి?

విజయ్, అనసూయ మధ్య వివాదం ఏంటి?

సాధారణగా ఏ విషయాన్నైనా తెగేదాకా లాగొద్దు అంటారు మన పెద్దలు. ఒకసారి రెండుసార్లు అంటే పరవాలేదు కానీ శృతి మించితేనే చిరాకేస్తుంది. ప్రస్తుతం బిల్లితెర యాంకర్ అనసూయ చేసేది చూస్తుంటే ఎవరికైనా చిరాకేయడం ఖాయం. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ టైమ్ లో మొదలైన విజయ్ దేవర కొండ, అనసూయ వివాదం సద్గుమణగడం లేదు.

వివాదం ఎక్కడ మొదలైంది? 

అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా.. పబ్లిక్ స్టేజ్ మీద "ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్ ***" అనే డైలాగ్ చెప్పడంపై అనసూయ బహిరంగంగానే విమర్శలు చేసింది. దీనిపై టీవీలో స్పెషల్ డిబేట్లో కూడా పాల్గొంది. దీంతో..  విజయ్ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. అప్పటినుంచి వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.

విజయ్ ఫ్యాన్స్ పై అనసూయ కంప్లయిట్

మధ్యలో విజయ్ దేవరకొండ 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమాలో అనసూయ నటించడంతో.. ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది అనుకున్నారు అంతా.. కానీ లైగర్ టైంలో మరోసారి గిల్లీ మరీ కాంట్రవర్సీ చేసింది అనసూయ. 'లైగర్' మూవీ డిజాస్టర్ గా నిలిచిన సమయంలో కూడా అనసూయ ట్వీట్ చేస్తూ 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!' అంటూ ఇన్ డైరెక్ట్ గా విజయ్ పై కామెంట్స్ చేసింది. అప్పుడు మరోసారి ఈ ఇష్యూపై పెద్ద చేర్చే జరిగింది. ఆ సమయంలో విజయ్ ఫ్యాన్స్  అనసూయని ఆంటీ అంటూ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కి సహనం కోల్పోయిన అనసూయ.. వారిపై పోలీస్ స్టేషన్ లో కంప్లయిట్ కూడా ఇచ్చింది. అలా కొన్నిరోజులు ఈ వివాదం సాగింది.

ఖుషి" పోస్టర్ పై ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసిన అనసూయ

విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఖుషి" పోస్టర్ పై ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసింది అనసూయ. మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో 'THE విజయ్ దేవరకొండ' అని రాసుంది. దానిపై అనసూయ భరద్వాజ్ 'The' అని ప్రస్తావిస్తూ "ఇప్పుడే ఒకటి చూశాను.. ‘The’నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం"  అంటూ ట్వీట్ చేసింది. దీంతో.. అనసూయపై రౌడీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. హీరోలంతా తమ పేర్ల ముందు స్టార్ ట్యాగ్ తగిలించుకుంటున్నప్పుడు, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ పేరు ముందు The అని పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

నువ్వు The అనసూయ, The ఆంటీ అని పెట్టుకో ఎవరు వద్దన్నారు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక అక్కడితో ఆగకుండా.. "భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ.. oops.. బంగారుకొండలంతా.. ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తూనే ఉన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు" అంటూ మరో ట్వీట్ చేసింది అనసూయ. ఇక సహనం కోల్పోయిన విజయ్ ఫ్యాన్స్ అనసూయని ఆంటీ అంటూ చిత్ర విచిత్రమైన కామెంట్స్, ట్రోల్స్  చేస్తూ ఆడేసుకుంటున్నారు. అంతేకాదు.. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న అనసూయ.. అటెన్షన్ కోసమే ఇప్పుడు ఈ ట్వీట్ చేసిందని విజయ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా? లేదా అనేది చూడాలి మరి.