సిగరెట్ అలవాటు మన దేశంలో ఒక అలవాటు నుండి ప్రస్తుతం పాషన్ అయిపొయింది. మైనర్లు కూడా ఇందుకు అలవాటు పడిపోతున్నారు. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేసిన/ ప్రభుత్వం చర్యలు చేపట్టిన ధూమపానం చేసే వారి కౌంట్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ప్రపంచ స్థాయిలో వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రూపొందించిన ఒక కొత్త రిపోర్ట్ భయంకరమైన విషయాలను తెలియజేసింది. ఇందులో మన దేశంలో 42% మంది పురుషులు సిగరెట్లు తాగుతున్నారని వెల్లడించింది, దింతో పురుషులు అత్యధికంగా ధూమపానం చేసే/ సిగరెట్ తాగే దేశాలలో ఇండియా 13వ స్థానంలో ఉంది.
ఈ లిస్టులో టాప్ లో ఇండోనేషియా (70.5%) తరువాత రెండో స్థానంలో మయన్మార్ (70.2%) ఉన్నాయి, ఈ దేశాలలోని పురుషుల్లో ధూమపానం ఇండియా కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. 3వ స్థానంలో బంగ్లాదేశ్ (60.6%), 4వ స్థానంలో చిలీ (49.2%), ఆశ్చర్యకరంగా చైనా (47.7%)తో 5వ స్థానంలో ఉంది. ఈ లెక్కలు చాల దేశాల్లో 10 మంది పురుషుల్లో నలుగురి కంటే ఎక్కువ మంది రోజు తప్పకుండా ధూమపానం చేస్తున్నారని చూపిస్తుంది.
ఈ లిస్టులో ఇండియా టాప్ లో లేనప్పటికీ, పురుషుల్లో 42% మంది ధూమపానం చేయడం అనేది ఆందోళనకరంగా మారింది. అంటే ఫ్రాన్స్ (36%), దక్షిణ కొరియా (38.2%), UAE (35.6%) వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ. ఈ దేశాలు పొగాకు నివారణ చర్యలు, ప్రజా విద్య, పన్నుల విషయంలో విజయం సాధించాయి.
.
భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య కేవలం సిగరెట్/ ధూమపానాన్ని తగ్గించడం మాత్రమే కాదు పెరుగుతున్న ఆరోగ్య ప్రమాదాలతో పాటు బీడీలు, పొగాకు నమలడం వంటి ఇతర రకాల అలవాట్లను కూడా పరిష్కరించడం అని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య హెచ్చరికలు, ప్రజా విద్యా ప్రచారాలతో పాటు పొగాకు వ్యతిరేక చట్టం అమలులో ఉన్న ముఖ్యంగా గ్రామీణ, తక్కువ-SES జనాభాకు మెరుగైన అట్టడుగు జోక్యాల అవసరాన్ని గణాంకాలు చూపిస్తున్నాయి.
పశ్చిమ దేశాలు మెల్లిమెల్లిగా సిగరెట్లను తొలగిస్తుండగా ఆసియా ముఖ్యంగా భారతదేశం నికోటిన్ వ్యసనంతో పోరాడుతూనే ఉంది. బలమైన నివారణ చర్యలు తీసుకోకపోతే దేశంలో పొగాకు వాడకంతో క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందిని సూచిస్తుంది.
