తమిళనాడు కేబినెట్ విస్తరణ..విజయ్ మంత్రివర్గంలో 21 టీవీకే,2 కాంగ్రెస్.. ఐయూఎంఎల్, వీసీకేకు దక్కని చోటు

తమిళనాడు కేబినెట్ విస్తరణ..విజయ్ మంత్రివర్గంలో 21 టీవీకే,2 కాంగ్రెస్.. ఐయూఎంఎల్, వీసీకేకు దక్కని చోటు

తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టింది. గురువారం ( మే 21)  ఉదయం 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. విజయ్ ప్రభుత్వంలో ఇద్దరు కాంగ్రెస్  ఎమ్మె్ల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారి చేరికతో 59 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో భాగమయ్యింది. చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.