ఆ సినిమా చూసి ప్యాంట్ తడుపుకున్నా..

ఆ సినిమా చూసి ప్యాంట్ తడుపుకున్నా..

తన సహజ నటనతో తెలుగు అభిమానులకు దగ్గరై... నేచురాల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు నాని.. అప్పట్లో ప్యాంట్ తడుపుకున్నాను అంటూ ఓ ఆసక్తికర సన్నివేశాన్ని పంచుకున్నారు. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు అనే విషయాలను గమనిస్తే.. ఓ సారి సినిమా థియేటర్లో మూవీ చూస్తూనే ప్యాంట్ తడిపేసుకున్నాడట. అప్పట్లో ఒక సినిమాకు వెళ్ళవద్దని ఇంట్లో వాళ్ళు చెప్పినా వినకుండా తన స్నేహితులతో కలిసి ఆ సినిమాకు వెళ్ళానన్న నాని.... ఆ మూవీ చూసి భయంతో ప్యాంట్ కూడా తడిసిపోయిందని చెబుతూ ఓపెన్ అయ్యారు.

ఇంతకీ నాని అంతగా భయపడ్డ మూవీ ఏంటా అని అనుకుంటున్నారా.. కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ దెయ్యం అని నాని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆ మూవీ అందర్నీ భయపెడుతూ.. ఎంతో క్రేజ్ ను దక్కించుకుంది. కాగా తన స్నేహితులతో కలిసి వెళ్లిన నాని... కొన్ని సీన్స్ చూసి తెగ భయపడిపోయానని వెల్లడించారు. భయంతో వెంటనే చెమటలు పట్టాయన్న నాని... ఓ హర్రర్ సన్నివేశం చూడగానే సడన్‌గా చేతిలో పట్టుకున్న కూల్ డ్రింక్ ప్యాంటుపై పడిందని.. దాంతో ప్యాంట్ మొత్తం తడిచిపోయిందని తెలిపారు.  ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకోగా.. వారు విరగబడి నవ్వారని అన్నారు. 

నాని ఇటీవల నటించిన అంటే సుందరానికీ సినిమా జూన్ 10న విడుదల కానుండగా మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే నాని తన పర్సనల్ లైఫ్ లోని మరపురాని ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. 

 

మరిన్ని వార్తల కోసం...

మాస్క్‌‌లు కంపల్సరీ.. భౌతిక దూరం పాటించండి

హ్యాట్సాఫ్ కండక్టరన్నా... నెటిజన్లు ఫిదా